ప్రజాశక్తి -ఎస్‌ఆర్ పురం (చిత్తూరు) : ఎస్‌ఆర్.పురం మండలం పార్టీ కార్యాలయంలో నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను సోమవారం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త చిట్టిబాబు నాయుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున రక్త దానం చేసేందుకు యువకులు ముందుకు వచ్చారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాల అధ్యక్షులు, కార్యకర్తల ద్వారా సుమారు 300 యూనిట్లు బ్లడ్‌ను ఎన్టీఆర్ ట్రస్టుకు అందిస్తామని టిడిపి సమన్వయకర్త చిట్టి బాబు నాయుడు తెలిపారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా అధ్యక్షులు నాని సందర్శించి యువకులను అభినందించారు. ఎమ్మెల్సీ దొరబాబు టిడిపి జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, సమన్వయకర్త చిట్టి బాబు నాయుడు భారీ కేక్ కట్ చేసి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో జన్మదిన సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










