ప్రజాశక్తి కుప్పం (చిత్తూరు) : సింగార పురం గ్రామ శివార్లలోని నాటు సారా స్థావరాలపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేస్తున్నట్లు సమాచారం రావడంతో సింగార పురం గ్రామ శివార్లలో నాటు సారా తయారీ కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించామని ఎస్.ఐ శివకుమార్ తెలిపారు. నాటు సారా తయారు చేసినా, విక్రయించినా కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు










