Apr 25,2023 15:23

ప్రజాశక్తి-హిందుపురం(అనంతపురం) : ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మోడల్‌ ఎంసెట్‌ పరీక్ష విజయవంతం అయినట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి తెలిపారు. అనంతపురంలోని హిందూపురం పట్టణంలోని సప్తగిరి కళాశాల పరీక్ష కేంద్రంగా మోడల్‌ ఎంసెట్‌ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షకు 500 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పివికెకె ప్రొఫెసర్‌ డాక్టర్‌ రమేష్‌ రావు, సప్తగిరి ఎంబీఏ కళాశాల ప్రిన్సిపల్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎంసెట్‌ పరీక్ష రాసే విద్యార్థులకు ఈ మోడల్‌ పరీక్ష చాలా ఉపయోగపడుతుందని మైన్‌ పరీక్ష పట్ల ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడం కోసమే ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని, అంతేకాకుండా విద్యార్థులకు మంచి అవగాహన ఈ పరీక్ష ద్వారా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి కళాశాల ప్రిన్సిపల్‌ శివశంకర్‌ రెడ్డి, సప్తగిరి కళాశాల ఏవో గంగిరెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చంద్రశేఖర్‌, హర్ష, మహేష్‌, భగత్‌, వినోద్‌, నిహాల్‌, అభి, రమేష్‌, నాగేంద్ర నవీన్‌, లిఖిత్‌ పాల్గొన్నారు.