Apr 20,2023 14:47

ప్రజాశక్తి-హిందూపురం(అనంతపురం) : ఈనెల 24న పట్టణంలోని సప్తగిరి కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మోడల్‌ ఎంసెట్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి బాబావలి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని కళాశాల వసతి గృహం వద్ద మోడల్‌ ఎంసెట్‌పై బాబావలి మాట్లాడారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, ప్రధాన పట్టణాల్లో మోడల్‌ ఎంసెట్‌ నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే హిందూపురం పట్టణంలో కూడా ఈనెల 24వ తేదీన సప్తగిరి కళాశాల పరీక్ష కేంద్రంగా మోడల్‌ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంసెట్‌తో పాటు వివిధ పోటీ పరీక్షలకు పాల్గొనే విద్యార్థులకు అవగాహన పెంచడానికి కోసం ఈ మోడల్‌ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఎంసెట్‌ పరీక్ష రాసే ప్రతి విద్యార్థి కూడా ఈ మోడల్‌ పరీక్షను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మోడల్‌ ఎంసెట్‌ పరీక్ష రాసే విద్యార్థులు 98856 00478 నెంబర్‌కు ఫోన్‌ చేసి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చంద్రశేఖర్‌, నిహాల్‌, హర్ష కుమార్‌, భగత్‌, వినోద్‌, అభిలాష్‌, రమేష్‌, నాసిర్‌, హర్ష, తదితరులు పాల్గొన్నారు.