ప్రజాశక్తి - పుత్తూరు టౌన్(చిత్తూరు) : నగిరి నియోజకవర్గలోని నిండ్ర మండల అరూరులో రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మంత్రివర్యులు ఆర్కే రోజా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు బాగుండాలని ఉద్దేశ్యంతో సిఎం జగన్ సచివాలలోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడే ఎరువులు విత్తనాలు, రైతులకు కావలసిన వివరాలు సచివాలయం పరిధిలోని జరిగే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతు భరోసా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి, డివిజన్ స్థాయి అధికారులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.











