Apr 24,2023 13:38

ప్రజాశక్తి -పాలకోడేరు (పశ్చిమ గోదావరి) : శృంగవృక్షం గ్రామం చింతల వద్ద ఉన్న తాండ్రపాపారాయుడు విగ్రహానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్‌ రావు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా పర్యటనకు సోమవారం విచ్చేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావుకు వైసిపి నాయకులు, కుల సంఘ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తాండ్ర పాపారాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి స్థానిక నాయకులతో ముచ్చటించారు. మంత్రి వెంట జడ్పీ చైర్మన్‌ కౌరు శ్రీనివాస్‌, శృంగావృక్షం గ్రామ పార్టీ కన్వీనర్‌ గునుపూడి పాండురంగారావు, సొసైటీ మాజీ చైర్మన్‌ నడింపల్లి రామకృష్ణ రాజు, బ్యాంకు బుజ్జి, మాజీ సర్పంచ్‌ కటిక శ్రీదేవి, భీమవరం మార్కెట్‌ యాడ్‌ డైరెక్టర్‌ మాతల కాశి, నందమూరి గరువు, గ్రామ సర్పంచ్‌ మేకల వెంకటాచలపతిరావు (కొండ), మాజీ సర్పంచ్‌ నక్కెళ్ళ అప్పారావు, స్థానికులు పాల్గొన్నారు.