ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు వైద్య పరిక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పి.కిరణ్మయి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమం ద్వార వైద్య పరిక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 68 మంది గర్భిణీ మహిళలకు రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. నెలల నిండిన మహిళలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే పురుడు పోసుకొని ప్రభుత్వం నుండి అందించే సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఓ.జాలాది విల్సన్ బాబు, వైద్య సిబ్బంది వెల్లేకమల, ఆషాలు జి.స్రవంతి, అసిస్టెంట్‌లు ఎం.నల్లయ్యజి.శ్రీనివాస్. పాల్గొన్నారు.










