May 23,2023 14:50

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా నగరంలోని 1 నుండి 18వ సచివాలయాల పరిధిలోని వార్డు వాలంటీర్లను కౌన్సిల్‌ హాలులో నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం సత్కారించారు. ఈ సందర్భంగా మేయర్‌ వసీం మాట్లాడుతూ.. నగర అభివృద్ధిలో వాలంటీర్ల సేవలు ప్రశంసనీయమన్నారు. కేవలం ప్రతిభ ఆధారంగానే పూర్తి పారదర్శక విధానంలో సేవా వజ్ర, సేవా రత్న అవార్డులకు వాలంటీర్లను ఎంపిక చేశారని,సేవా వజ్ర, సేవా రత్న అవార్డులు రాని వారు పనిచేయడం లేదు అని కాదన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో మెరుగైన సేవలు అందిస్తునే ఉన్నారన్నారు. కాకపోతే ఇంకా మీ పనితీరు మెరుగు పరచుకుని వచ్చే ఏడాది సేవా వజ్ర, సేవా రత్న అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు విజయభాస్కర్‌ రెడ్డి, వాసంతి కమిషనర్‌ రమణారెడ్డి, కార్యదర్శి సంఘం శ్రీనివాసులు పాల్గొన్నారు.