Apr 29,2023 14:40
/Mayday-celebrations-CITU

ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : మేడే సందర్భంగా గణపవరంలో జరిగే ప్రదర్శన బహిరంగసభలో కార్మికవర్గంపెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు గణపవరం మండల కార్యదర్శి పి.గోవీందు శనివారం ఒకప్రకటనలో కోరారు. మేడే రోజు ఉదయం8.గంటలకు స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద నుండి ప్రదర్శన ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రదర్శనలో కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, డోక్రాయానిమేటర్లు, పంచాయతీ కార్మికులు, విలేజ్‌ అసిస్టెంట్‌లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.