ప్రజాశక్తి-వి.కోట(చిత్తూరు) : వచ్చే మామిడి సీజన్‌కు కుప్పం ప్రాంత రైతులకు నూతనంగా నిర్మించనున్న మార్కెట్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ పి.శ్రీనివాసులు తెలిపారు. పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వి.కోట మండలం, కొంగాటం గ్రామ పంచాయతీ శివుని కుప్పంలో మామిడి మార్కెట్ యార్డు కొసం కేటాయిచిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. త్వరితగతిన పనులు చేపట్టి ప్రజలకు, రైతులకు మార్కెట్ను అందుబాటులోకి తీసుకురావాలని మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డిని జెసి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్, పలమనేర్ ఆర్డిఓ శేషయ్య వి.కోట తహశీల్దార్ చిట్టిబాబు, కొంగాటం గ్రామ పంచాయతీ సర్పంచ్ అనిత జయరామిరెడ్డి, పలమనేరు ఉపాధ్యక్షులు పుష్పలతా ఆంజనేయులు , మార్కెట్ కమిటీసభ్యులు నారాయణ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వీణా, రైతులు, మార్కెట్ యార్డు కార్యదర్శి వి.సంజీవ కుమార్ , సిబ్బంది పాల్గొన్నారు.










