ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ... మండలంలోని సిహెచ్.అగ్రహరంలో మంగళవారం పిప్పర ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గన్న కాశిపాడు ఆరోగ్య సహాయకులు నామాల రాజు మాట్లాడుతూ ... జాతీయ కీటక జనత వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం జరుగుతుందని చెప్పారు. గ్రామాల్లో ఎవరికైనా చలి, జ్వరము, తలపోటు, ఒంటినొప్పులు ఉంటే మలేరియా వ్యాధిగా గుర్తించవచ్చునని అన్నారు. వ్యాధి నివారణకు దోమతెరలు వాడాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక యూపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు చింతలపాటి దుర్గ భవాని, హెచ్పి ఎల్ హెచ్ పి మాధురి, ప్రకాష్, రమేష్, ఆశా వర్కర్లు భవాని, దుర్గ, సాయమ్మ, శ్రీదేవి, పెద్దింట్లు పాల్గొన్నారు.










