ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం సిపిఐ మండల కార్యదర్శి డి.పెద్దయ్య మాట్లాడుతూ ... పుట్లూరు మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ అనుబంధ సంఘమైన చేతి వృత్తిదారుల సమైక్య మండల కమిటీ ఆధ్వర్యంలో అనంతపురంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సమైక్య రాష్ట్ర సదస్సు పాల్గొని రజకులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులను కాపాడుకోవడానికి అలాగే రజకుల సమస్యలపై రాష్ట్ర సదస్సులో చర్చల్లో పాల్గొనడానికి పుట్లూరు మండలం నుంచి చేతి వృత్తిదారుల సమైక్య మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఓబులపతి, ఓబులేసు ఆధ్వర్యంలో అనంతపురంలో జరుగుతున్న రజక వృత్తిదారుల రాష్ట్ర సదస్సుకి మండలంలోని అరకటవేముల, కడవకల్లు, చింతకుంట, కొండాపురం, నుంచి రజకులు పుట్లూరు మండల కమిటీ సభ్యులు బయలుదేరి రావడం జరిగినది. మడుగుపల్లి ఓబులేసు, చిన్నబలప్ప, సుదర్శన, శ్రీనివాసులు, శేఖర్, ఈశ్వరయ్య, కులశేకర్, చంద్ర, తదితరులు తరలివెళ్లిన వారిలో ఉన్నారు.










