May 25,2023 13:24

ప్రజాశక్తి-భీమవరం (పశ్చిమగోదావరి) : ఈ నెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలోని వేమగిరి దగ్గర నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలని టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో భీమవరం పట్టణ అధ్యక్షులు ఇందుకురి సుబ్రహ్మణ్యరాజు అధ్యక్షతన నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. 27వ తేదీన నిర్వహించే ప్రతినిధుల మహాసభకు ముఖ్య నాయకులు పాల్గొంటారని చెప్పారు. 28న మహానాడు బహిరంగసభకు ప్రజలు అందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు. నరసాపురం పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల నుండి ఒక లక్ష 25 వేల మంది తరలి వెళ్ళనున్నారని తెలిపారు. భీమవరం నియోజకవర్గం నుండి ప్రైవేటు బస్సులు, కార్లు, ఆటోలు ద్వారా సుమారు పదివేల మంది మహానాడు సభకు హాజరవుతారని వెల్లడించారు. ఈ సమావేశంలో అంగన్వాడి, డ్వాక్రా సంఘాల ప్రధానకార్యదర్శి మేరగని నారాయణమ్మ, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వెండ్ర శ్రీనివాస్‌ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు మామిడిసెట్టి ప్రసాద్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరి సుబ్బారావు, నాయకులు ఎద్దు ఏసుపాదం, ఎండి నౌషాద్‌, బొక్క సూరిబాబు, గంట త్రిమూర్తులు, చల్లబోయిన గోవింద్‌, కోళ్ల నాగబాబు, మద్దుల రాములు, మాంతి గణపతి, కోండ్రు శ్రీనివాస్‌, కటికల పల్లారావు, పామర్తి వెంకటరామయ్య, విజ్జురోతి రాఘవులు, బి. పద్మ అంగర వెంకటేశ్వరరావు, అల్లూరి సుబ్రహ్మణ్యరాజు గోట్టుముక్కల విశ్వనాథరాజు,కొండవీటి శ్రీనివాస్‌, వజ్జిపర్తి గురుమూర్తి, కోళ్ల సీతారాం, చెరుకపల్లి సంతోష్‌ కుమార్‌, రబ్బాని, ఎండి ఫిరోజ్‌, ఎండి ఖలీల్‌, పడమట సోమేశ్వరరావు,మాత సురేష్‌ బాబు, మండవల్లి సంబు నేదునూరి గంగాధర్‌, దొంగ వెంకటేశ్వరరావు, మరపట్ల శ్యాంబాబు మిర్తిపాటి గున్నేశ్వరరావు పాల్గొన్నారు.