ప్రజాశక్తి-కాళ్ల (పశ్చిగోదావరి) : వేసవిలో మజ్జిగ తాగటం ఎంతో ఆరోగ్యమని మాజీ ఎంపిపి వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు అన్నారు. గురువారం కాళ్లకూరు గ్రామంలో దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. మజ్జిగ చలివేంద్రన్ని మాజీ ఎంపిపి వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వేసవి దాహార్తిని తీర్చడానికి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషదాయకమన్నారు. దాట్ల వెంకట రామరాజు మాట్లాడుతూ నేటి నుంచి మే,జూన్ నెలలో మజ్జిగ చలివేంద్రం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నడింపల్లి ప్రదీప్ రాజు, దండు రఘు కుమార్ రాజు, వేగేశ్న రామకృష్ణంరాజు, వేగేశ్న రామరాజు, బొర్రా వెంకటేశ్వరరావు, కెంగం పెద్దిరాజు, తదితరులు పాల్గొన్నారు.










