Jun 25,2023 16:35
  •  వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించిన ఏపీ రైతు సంఘం నాయకులు

ప్రజాశక్తి-ఆత్మకూరు(అనంతపురం) : రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఏపీ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30న విజయవాడలో మహాధర్నా జయప్రదం చేయాలని రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండల కేంద్రంలో గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మహిళ సంఘం రాష్ట నాయకులు సావిత్రి, ఏపీ రైతు సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమప్రాంతంలో వెనుకబడిన జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు. అప్పర్‌ భద్ర ప్రాజెక్టు అనుమతులు రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. 2022 ఖరీఫ్‌ రబీ సీజన్లలో పంటలు నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్‌ సబ్సిడీ పంటల బీమా విడుదల చేయాలని, వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోయినందున 0 వడ్డీ పథకం, 2 లక్షలకు, పావలా వడ్డీ పథకం ఐదు లక్షలకు పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కనీసం పెట్టుబడులు కూడా చాలడం లేదని ఆయన తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ధరలపై అదనంగా 20% బోనస్‌గా ఇవ్వాలని కోరారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే పద్ధతిని నిలుపుదల చేయాలని ఉచిత విద్యుత్తును యధావిధిగా కొనసాగించాలని,డ్రిప్‌ స్పింకర్లకు జిఎస్టీ రద్దు చేసి ప్రతి రైతుకు 90% సబ్సిడితో ఇవ్వాలని తెలిపారు. జిల్లాలో కౌలు రైతులందరికీ గ్రామ సభల ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ కౌలు రైతులకు వర్తింపచేయాలన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30న విజయవాడలో జరిగే మహా ధర్నాను అనంతపురము జిల్లా రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల రైతుసంఘం నాయకులు శివశంకర్‌, రామయ్య, రాజేశ్వరి, జయమ్మ, నాగసుధ, శ్రీదేవి, ఉమా తదితరులు పాల్గొన్నారు.