Mar 28,2023 17:47

ప్రజాశక్తి - పెనుమంట్ర (పశ్చిమగోదావరి) : పౌష్టికాహారాన్ని అందించడమే జగనన్న గోరుముద్ద లక్ష్యమని ఎండిఎం జిల్లా సమన్వయకర్త కే.కృష్ణారావు అన్నారు. మంగళవారం పొలమూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ఎంపియుపి స్కూల్‌ లో మధ్యాహ్న భోజన పథకాన్ని రాగి జావా పంపిణీ కార్యక్రమాన్ని , డ్రింకింగ్‌ వాటర్‌ , టాయిలెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అధిక ప్రాధాన్యం తీస్తుందన్నారు. పోషక విలువలతో కూడిన మెనూను రూపొందించడమే కాకుండా , వారానికి ఐదు రోజులు కోడి గుడ్డు, 3 రోజులు చిక్కి మరో మూడు రోజులు రాగిజావ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బండి ఆంజనేయులు, సిఆర్పి కుక్కల మంగతాయారు, దొంగ సత్యనారాయణ , ఎస్‌ఎంసి చైర్మన్‌ దుర్గాప్రసాద్‌, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.