యల్లనూరు (అనంతపురం) : యల్లనూరు మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. మంగళవారం 9 మందిని పిచ్చికుక్క కరిచింది. పిచ్చికుక్క దాడిలో ముగ్గురు పాఠశాల విద్యార్థులు, ఒక వికలాంగుడు, ఐదుగురు స్థానికులు గాయపడ్డారు. బాధితులందరినీ తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల చొరవతో పిచ్చికుక్క ను వెంబడించి చంపేశారు.










