ప్రజాశక్తి-పీలేరు (రాయచోటి-అనంతపురం) : పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి బిస్మిల్లా ఆటో యూనియన్ డ్రైవర్స్ కాలనీలో బోరుబావికి మోటారు, పైపులు, స్టార్టర్ ఏర్పాటు చేసినట్లు ఎంపిపి కంభం సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఎంపిపి మాట్లాడుతూ ... పీలేరు మండలం, కాకులారంపల్లి పంచాయతీ, ఇందిరమ్మ కాలనీ సమీపంలోని ఆటో డ్రైవర్స్ కాలనీలో ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మంజూరు చేసిన నిధులతో ఇటీవల బోరు బావిని తవ్వించామని, ప్రస్తుతం దానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చినట్లు చెప్పారు. ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బోదేషా వలి మాట్లాడుతూ ... ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెద్ది, ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి, ఎంపిపి సతీష్ కుమార్ రెడ్డికి కఅతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకులారంపల్లి సర్పంచ్ హరిణి సురేష్ కుమార్ రెడ్డి, ఆటో యూనియన్ పట్టణ ఉపాధ్యక్షులు. నౌలక్ హుస్సేన్, ఇస్మాయిల్, శీను, తదితరులు పాల్గొన్నారు.










