Jun 06,2023 14:55

ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమగోదావరి) : పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో దళితుల భూములలో అక్రమ మట్టి మాఫియా చర్యలను అడ్డుకున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అక్రమ అరెస్టు చేయడాన్ని టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఖండించారు. దళితల ఓట్లతో గద్దెనెక్కిన జగన్‌ దళితుల ఆస్తులను, భూములను కబ్జా చేస్తూ, సంక్షేమ పథకాలను రద్దు చేసి తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. చించినాడా గోదావరి లంక భూములలో వైసిపి నాయకులు దళితుల భూములను కాజేస్తుండడంతో బాధితులకు రక్షణగా, సిపిఎంతో కలిసి ధర్నా చేస్తున్న నిమ్మల రామానాయుడును పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడానికి ఖండిస్తున్నామని పేర్కొనారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులు త్వరలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దిప పనున్నారని తెలిపారు.