Sep 05,2023 16:19

ప్రజాశక్తి-వి కోట(చిత్తూరు) : మండల పరిధిలోని కస్తూరి నగరం సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం లారీ, పాల ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కస్తూరి నగరం సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు లారీ పాల ఆటో ఢీకొనడంతో తోటకనుమకు చెందిన ఆటో డ్రైవర్‌ హమీద్‌ రెండు కాళ్లు విరిగిపోవడంతో చికిత్స నిమిత్తం వి కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కుప్పంకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.