Apr 25,2023 12:44

ప్రజాశక్తి-కనగానపల్లి (అనంతపురం) : మండల పరిధిలోని మామిళ్లపల్లి లో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యం లో మంగళవారం ప్రచార భేరిని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జేవీ రమణ, బత్తల కదిరప్ప, సిపిఐ జిల్లా కమిటీ నాయకులు కాటమయ్యా, బ్యాళ్ల మహాదేవ మాట్లాడుతూ ... కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలుపుతూ ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశామన్నారు. ఈనెల 14 నుండి 30వ తేదీ వరకు సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న మోడీ హటావో - దేశ్‌ బచావో పేరుతో ప్రచార భేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచిపెడుతోందని మండిపడ్డారు. ప్రజల్లో కులతత్వాన్ని, మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్యం చేసేందుకు 14వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రచార భేరి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యుడు మహదేవ వడ్ల గోవిందు, ముత్యాలు, ఈశ్వరయ్య, మహానంద, నాగేష్‌, తదితరులు పాల్గొన్నారు.