Mar 28,2023 17:43

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : ఏప్రిల్‌ 5 చలో ఢిల్లీ కార్యక్రమాన్నీ జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు కోరారు. మంగళవారం మారంపల్లి గ్రామంలో ఉపాధి కూలీలతో చలో ఢిల్లీ వాల్‌ పొస్టర్‌ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12 డిమాండ్లతో చలో పార్లమెంటుకు ఏప్రిల్‌ 5వ తేదీన రైతు వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, కౌలు రైతు సంఘాలు సంఘాలు పిలుపునిచ్చాయన్నారు.అధిక ధరలను అరికట్టి, ఆహార నిత్యావసరాలపై జీఎస్టీని సవరణ చేసి, పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాసులపై ఎక్సైజ్‌ పన్ను గణనీయంగా తగ్గించాలన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను అందుబాటులో తెచ్చి 14 రకాల నిత్యవసర సరుకులు సరఫరా చేయాలని, అందరికీ గహ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలంద మద్దతు ఇచ్చి చలో ఢిల్లీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కే ఈశ్వర్‌, డి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.