May 16,2023 14:53

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : డెంగ్యూ వ్యాధి నిర్దారణకు ఆరోగ్య పరీక్షలే కీలకం అని తాడేపల్లిగూడెం మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి వై.లక్ష్మణరావు పేర్కొన్నారు. మంగళవారం జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలోని పలు ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతతోనే అనేక రకాల వ్యాధులను దూరం చేయొచ్చన్నారు. డెంగ్యూ వ్యాధికి పడిస్‌ దోమ కారణమని ఇంటి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని తద్వారా దోమలను నియంత్రించవచ్చనన్నారు. డెంగ్యూ వ్యాధి నివారణే లక్ష్యంగా చేయి చేయి కలిపి ముందుకు సాగుదాం అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు పట్టణాల్లో గ్రామగ్రామానా అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో డా.వై.ఎస్‌.ఆర్‌.పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డా.కే.అషాలతా, డా.చైతన్య, డా.ఎస్‌.అమృత, డా.శ్రావ్య ఆధ్వర్యంలో వార్డు ఆరోగ్య కార్యదర్శులు, ఆశాలు, మెప్మా సభ్యులు పాల్గొన్నారు.