Aug 19,2023 15:22

ప్రజాశక్తి-నార్పల(అనంతపురం) : మండల కేంద్రం ఆయన నార్పల మేజర్‌ పంచాయితీ 8వ వార్డు ఉప ఎన్నికల్లో టిడిపి మద్దతు దారు అభ్యర్థి కొత్త మిద్దె నాగభూషణం తన సమీప ప్రత్యర్థి తలారి ప్రసాద్‌పై 45 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. మొత్తం 900 ఓట్లకు 621 ఓట్లు పోలుకాగా టిడిపి మద్దతు దారు కొత్త మిద్దె నాగభూషణంకు 330 ఓట్లు, ప్రసాద్‌కు 285 ఓట్లు వచ్చాయి. చెల్లని ఓట్ల 5, నోటాకు ఒక ఓటు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. విజయం సాధించిన కొత్త మిద్దె నాగభూషణంకు అధికారులు డిక్లరేషన్‌ ఫారం అందజేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎంపీడీవో దివాకర్‌, ఈవో ఆర్‌డి లక్ష్మీనరసింహ, కార్యాలయ పర్యవేక్షకురాలు ఉమాదేవి, ఇరు పక్షాల ఏజెంట్లు అభ్యర్థులు, పోలింగ్‌ నిర్వహణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సిఐ అస్రార్‌ భాష, ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.