Nov 15,2023 22:05

ముంబయి: టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లి కొత్త చరిత్ర నెలకొల్పాడు. వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన సెమీఫైనల్లో సెంచరీని కొట్టి వన్డే కెరీర్‌లో 50 సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన సచిన్‌ టెండూల్కర్‌(49) రికార్డును బ్రేక్‌ చేశాడు. కోల్‌కతా వేదిక దక్షిణాఫ్రికాపై సెంచరీ కొట్టి వన్డేల్లో 49 సెంచరీ పూర్తి చేసుకోవడం ద్వారా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండ్కూలర్‌ రికార్డును తొలుత కోహ్లి సమం చేశాడు. కింగ్‌ కోహ్లి 50వ సెంచరీని కేవలం 279 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తి చేసి తన పేరును రికార్డు పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అలాగే కివీస్‌పై శతకంతో విరాట్‌... మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే వన్డే ప్రపంచకప్‌లో 8సార్లు 50కు పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సచిన్‌ టెండూల్కర్‌(7సార్లు) 50కు పైగా పరుగులు రికార్డును బ్రేక్‌ చేశాడు. అలాగే ఒక ప్రపంచకప్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు(674) చేసిన బ్యాటర్‌గానూ విరాట్‌దే అగ్రస్థానం. ఇంతకుముందు సచిన్‌ టెండూల్కర్‌ 2003లో చేసిన 673 పరుగులు పేరిట ఉండేది.

  • విరాట్‌ కోహ్లీ సెంచరీల పూర్తి జాబితాను ఇక్కడ చూడండి:-

1. 2009 శ్రీలంక 107 కోల్‌కతా
2. 2010 శ్రీలంక 102 ఢాకా
3. 2010 ఆస్ట్రేలియా 118 విశాఖపట్నం
4. 2010 న్యూజిలాండ్‌ 105 గౌహతి
5. 2011 బంగ్లాదేశ్‌ 100 ఢాకా
6. 2011 ఇంగ్లాండ్‌ 107 కార్డిఫ్‌
7. 2011 ఇంగ్లండ్‌ 112 ఢిల్లీ
8. 2011 వెస్టిండీస్‌ 117 విశాఖపట్నం
9. 2012 శ్రీలంక 133 హౌబర్ట్‌
10. 2012 శ్రీలంక 108 ఢాకా
11. 2012 పాకిస్తాన్‌ 183 ఢాకా
12. 2012 శ్రీలంక 106 హంబన్‌తోట
13. 2012 శ్రీలంక 128 కొలంబో
14. 2013 వెస్టిండీస్‌ 102 పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌
15. 2013 జింబాబ్వే 115 హరారే
16. 2013 ఆస్ట్రేలియా 100 జైపూర్‌
17. 2013 ఆస్ట్రేలియా 115 నాగ్‌పూర్‌
18. 2014 న్యూజిలాండ్‌ 123 నేపియర్‌
19. 2014 బంగ్లాదేశ్‌ 136 ఫతుల్లా
20. 2014 వెస్టిండీస్‌ 127 ధర్మశాల
21. 2014 శ్రీలంక 139 రాంచీ
22. 2015 పాకిస్తాన్‌ 107 అడిలైడ్‌
23. 2015 దక్షిణాఫ్రికా 138 చెన్నై
24. 2016 ఆస్ట్రేలియా 117 మెల్బోర్న్‌
25. 2016 ఆస్ట్రేలియా 106 కాన్బెర్రా
26. 2016 న్యూజిలాండ్‌ 154 మొహాలి
27. 2017 ఇంగ్లాండ్‌ 122 పూణే
28. 2017 వెస్టిండీస్‌ 111 కింగ్‌స్టన్‌
29. 2017 శ్రీలంక 131 కొలంబో
30. 2017 శ్రీలంక 110 కొలంబో
31. 2017 న్యూజిలాండ్‌ 121 ముంబై
32. 2017 న్యూజిలాండ్‌ 113 కాన్పూర్‌
33. 2018 దక్షిణాఫ్రికా 112 డర్బన్‌
34. 2018 దక్షిణాఫ్రికా 160 కేప్‌ టౌన్‌
35. 2018 దక్షిణాఫ్రికా 129 సెంచూరియన్‌
36. 2018 వెస్టిండీస్‌ 140 గౌహతి
37. 2018 వెస్టిండీస్‌ 157 విశాఖపట్నం
38. 2018 వెస్టిండీస్‌ 107 పూణే
39. 2019 ఆస్ట్రేలియా 104 అడిలైడ్‌
40. 2019 ఆస్ట్రేలియా 116 నాగ్‌పూర్‌
41. 2019 ఆస్ట్రేలియా 123 రాంచీ
42. 2019 వెస్టిండీస్‌ 120 పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌
43. 2019 వెస్టిండీస్‌ 114 పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌
44. 2022 బంగ్లాదేశ్‌ 113 చిట్టగాంగ్‌
45. 2022 శ్రీలంక 113 గౌహతి
46. ??2022 శ్రీలంక 166 తిరువనంతపురం
47. 2023 పాకిస్తాన్‌ 122 కొలంబో
48. 2023 బంగ్లాదేశ్‌ 103 పూణే
49. 2023 దక్షిణాఫ్రికా 101 కోల్‌కతా
50. 2023 న్యూజిలాండ్‌ 106 వాంఖడే