ప్రజాశక్తి-గుడిపల్లి (చిత్తూరు) : ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గుడిపల్లి మండలం కనమనపల్లి చెరువుకు సోమవారం వేకువజామున గండి పడటంతో ఆయకట్ట రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఈ చెరువు ప్రమాదవశాత్తు తెగిపోతే తీవ్రంగా రైతుల పంటలన్నీ నీటిపాలవుతాయని, దీనితో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయకట్ట రైతన్నలు వాపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ భాస్కర్ అధికారులకు సమాచారం చేరవేశారు. ఇరిగేషన్ శాఖ వెంటనే పనులు మొదలుపెట్టడానికి చెరువు దగ్గరికి వస్తున్నారని సర్పంచ్ తెలియజేశారు. తక్షణమే ఈ గండిని పూడ్చి రైతన్నలను ఆదుకోవాలని స్థానిక రైతులు ప్రజలు కోరుకుంటున్నారు.










