ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : : విడపనకల్ మండల పరిధిలోని పాల్తూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐగా కె.సురేష్ బాబు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న రామచంద్రయ్య పుట్టపర్తి జిల్లాకు బదిలీ కావడంతో గుంతకల్ డీఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కే.సురేష్ బాబు ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ... స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండి స్టేషన్ పోలీస్ సిబ్బంది, గ్రామాలలోని ప్రజాప్రతినిధుల సమన్వయంతో మెరుగైన సేవలందించి శాంతి భద్రతలకు విధానం కలవకుండా ప్రత్యేక చర్యలు చేపడతానని తెలిపారు.










