Apr 15,2023 13:24

కాణిపాకం (చిత్తూరు) : చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్న పులి శ్రీనివాసులు శనివారం ఉదయం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కాణిపాకం ఆలయం వద్ద చిత్తూరు ఆర్డీఓ డాక్టర్‌ సి రేణుక, ఐరాల తహశీల్దార్‌ సుశీలమ్మ లు కలిసి జాయింట్‌ కలెక్టర్‌కు స్వాగతం పలికి స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు.