Jan 08,2023 13:48

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో, వెదురుకుప్పం మండలం పరిధిలో ఆదివారం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ పొన్న యుగంధర్‌ ఆధ్వర్యంలో ఇనాంకొత్తూరు పంచాయతీ, అయ్యన్నగారిపల్లె గ్రామంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ... వారితో మమేకమై జనసేన పార్టీ నాయకులు ప్రతి ఒక కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో ఆ గ్రామంలో ఉన్న చిన్నారులు పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌ కళ్యాణ్‌ పై ఉన్న క్రేజీతో ఆసక్తి చూపారు. పార్టీ జెండాను చేతబట్టుకొని పవన్‌ కళ్యాణ్‌ కి జేజేలు కొట్టారు. ఈ వింత అనుభూతి పార్టీ నాయకులకు మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచిందని పార్టీ శ్రేణులు అంటున్నారు.