Jun 02,2023 12:14

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో, వెదురు కుప్పం మండల కేంద్రములో 'న్యాయం కోసం జనసేన' పేరుతో నేతలు శుక్రవారం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి డాక్టర్‌ యుగంధర్‌ పొన్న మీడియాతో మాట్లాడుతూ ... వెదురుకుప్పం పాత్రికేయులపై అన్యాయంగా బనాయించిన కేసులను వెంటనే తీసివేయాలని, ఎస్‌ఐ లోకేష్‌ ని తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.