Apr 04,2023 16:18

ప్రజాశక్తి-వికోట (కోనసీమ) : మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే వెంకటే గౌడ పేర్కొన్నారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం వెలుగు మహిళా సమైక్య వారు నిర్వహించిన ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటే గౌడ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్రలో స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల ద్వారా పొందిన రుణాలు మాఫీ గురించి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి నాలుగు విడతలుగా పొదుపు సంఘాలలో 2019 ఏప్రిల్‌ నాటికి నిల్వ ఉన్న రుణబకాయులను పూర్తిస్థాయిలో ప్రభుత్వమే చెల్లిస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే మండలంలో 40 గ్రామ సంఘాలు ఉండగా వాటిలో 1833 మహిళా సంఘాలు ఉన్నాయన్నారు. వీటిలో 1290 సంఘాలలో 11997 మంది సంఘసభ్యులు ఆసరా లబ్ధి పొందారని, ఈ పథకం కింద మండలానికి మొత్తం 47,10,26,854 కోట్ల రూపాయలు మంజూరు అయిందన్నారు. అందులో భాగంగా మొదట విడుతలో 11,77,27,855 కోట్ల రూపాయలు మంజూరు కాగ రెండో విడతలో 11,79,27,855 కోట్ల రూపాయలు ఇదివరకే అందజేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం మూడో విడతగా 11,78,56,241 కోట్ల రూపాయలు మహిళ సంఘ సభ్యులు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. మహిళా సంక్షేమ పథకాలతో పాటు అన్ని వర్గాల పేద ప్రజల అభివద్ధి కి చేయూతనిచ్చే అనేక సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్న మన ముఖ్యమంత్రికి మహిళలందరూ తమ దీవెనలతో ఆశీర్వదించాలని జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు కోరారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హతే ప్రమానికంగా అందిస్తున్న గనత జగనన్న ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులకు మెగా చెక్కును అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎన్‌ నాగరాజు , జిల్లా పరిషత్‌ సలహా మండలి సభ్యులు గౌస్‌ , రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బాల గురునాథ్‌ , మండల వైస్‌ ఎంపీపీ తమీం ఖాన్‌ సింగిల్‌ విండో అధ్యక్షులు భవనం భక్త , గోపిరెడ్డి , మండల సచివాలయ కన్వీనర్‌ కిషోర్‌ గౌడ్‌ , వెలుగు సిసి నాగరాజు , శశికళ , పలువురు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు పెద్ద ఎత్తున మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.