Jul 14,2022 10:07

ప్రజాశక్తి - ఎస్‌ ఆర్‌ పురం (చిత్తూరు) : మహిళా పక్షపాతి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధే జగనన్న లక్ష్యమని రాష్ట్ర డిప్యూటీ సిఎం కళత్తూరు నారాయణస్వామి అన్నారు. గురువారం ఎస్‌ఆర్‌ పురం మండలంలోని క్షీర సముద్రం గ్రామంలోని డిప్యూటీ సీఎం నారాయణస్వామి, డిసిసిబి డైరెక్టర్‌ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి, స్థానిక సర్పంచ్‌ ఐశ్వర్య నాయకులు కార్యకర్తలు గడపగడపకు మన కార్యక్రమం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందించడమే జగనన్న లక్ష్యం అని ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ గడపగడపకు కార్యక్రం నిర్వహించారు.