ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : ప్రభుత్వ పథకాలను,సేవలను అందించేందుకు ప్రజల సంక్షేమం కోసమే 'జగనన్న సురక్ష' కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశ పెట్టారని దీన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ చందా చంద్రమ్మ, జెడ్పిటిసి ఏసీ ఎర్రి స్వామి, ఎంపీడీవో వరలక్ష్మి పేర్కొన్నారు. ఉరవకొండ సచివాలయం-5లో సర్పంచ్ లలిత అధ్యక్షతన మంగళవారం 'జగనన్న సురక్ష' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులు సంక్షేమ పథకాలు అందలేదనే పరిస్థితి ఉండరాదనే 'జగనన్న సురక్ష' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మేలు జరిగినప్పడే ప్రభుత్వానికి, అధికారులకు మంచిపేరు వస్తుందన్నారు. జగనన్న సురక్షలో 11 రకాలైన సర్టిఫికెట్లను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం 510 మంది దరఖాస్తుదారులకు వివిధ రకాలైన సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంబిసి కార్పొరేషన్ డైరెక్టర్ జోగి వెంకటేష్, కో అప్షన్ పామిడి సలీమ్, ఎంపిటిసిలు మంజుల, వన్నూరు సాబ్, వార్డ్ మెంబర్ రత్న, జేసిఎస్ పట్టణ కన్వీనర్ అసిఫ్, పార్టీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు బసవరాజు, సచివాలయ కన్వీనర్లు రామిరెడ్డి, బేల్దారి శర్మస్, విజరు, వైసిపి నాయకులు జోగి భీమన్న, జోగి హనుమంతు, అంగదాల అంజి,అమర్నాత్, స్కూలు కమిటీ చైర్మన్ శర్మస్, సీనా,సతీష్, నాగరాజు,ఎంఎల్‌ఓ ఓబులేసు, ఈఓఆర్డీ చంద్రమౌళి, ఈఓ గౌస్ సాహెబ్, సెక్రెటరీ పవన్,సచివాలయం ఉద్యోగులు, వలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.










