May 27,2023 13:13

శ్రీకాకుళం : జగనన్నకు చెబుదాం (స్పందన)లో వచ్చిన ఆర్జీలకు ప్రాధన్యత ఇవ్వాలని, ఆయా ఫిర్యాదులపై కచ్చితమైన సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ జి.ఆర్‌.రాధిక పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. శనివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో జగనన్న కు చెబుదాం (స్పందన) ఫిర్యాదుల పరిష్కార చర్యలపై పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ... రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందనకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, అంతే ప్రాధాన్యతతో ఫిర్యాదులు పరిష్కరించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఫిర్యాదు అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాతే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ కచ్చితంగా జరిపించాలని, విజిటింగ్‌ ఫొటోలు, ఎంక్వరి నివేదిక సకాలంలో నమోదు చేయాలన్నారు. ఎండార్స్‌మెంట్‌ రిపోర్ట్‌ బాధితులకు అందించాలని ఎస్పీ స్పష్టం చేశారు. స్పందనలో రీఓపెన్‌ అయిన వాటిపై సంబంధిత పోలీసు అధికారులు ప్రత్యేక దఅష్టి సారించాలన్నారు. రీఓపెన్‌ అయిన వాటిపై ఫోన్‌ ద్వారా మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు తీసుకుంటున్న వివరాలు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. తీసుకున్న చర్యలతో అర్జీదారు సంతఅప్తి చెందాలని, సంతఅప్తి చెందినట్లుగా ఆ వ్యక్తి నుండి స్పందన లభించాలని చెప్పారు.

జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆర్‌.వెంకట రామన్‌ మాట్లాడుతూ ... ప్రతి రోజూ వెబ్‌ సైట్‌లో వచ్చే ఆర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆర్జీలను పరిష్కరించకపోవడం లేదా మీరిచ్చిన సమాధానంతో అర్జీదారులు సంతఅప్తికాకపోవడంతో ఆర్జీలు రీఓపెన్‌ అవుతాయని తెలిపారు. ఇకపై ఇలాంటివి పునరావఅతం కాకూడదని, సక్రమమైన సమాధానం ఇవ్వకుండా ఫైలును ముగించకూడదు అని చెప్పారు. కచ్చితమైన సమాచారంతో ఆర్జిలు ముగించాలన్నారు. స్పందన పోర్టర్‌ లో వివరాలు పొందుపరచడం లో పలు అంశాలపై ఆయన కొన్ని సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ టిపి విఠలేశ్వర్‌, డిఎస్పీలు డి.బాల చంద్ర రెడ్డి, వై.శఅతి, జి.నాగేశ్వర రెడ్డి, ఎస్‌.వాసుదేవ్‌, ఎస్‌.బాల రాజు, ప్రసాదరావు, ఈ.ఆఫీస్‌ జిల్లా మేనేజర్‌ ఇంద్రశేఖర్‌, జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.