తణుకు రూరల్ (పశ్చిమ గోదావరి) : రాజస్థాన్ ప్రభుత్వం లోప భూయిష్టమైన చట్టం తెచ్చి ప్రైవేట్ వైద్యశాలలను బలిపశువును చేయటం సరికాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) తణుకు బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు ముప్పన రఘు, రమేష్ కుమార్ లు అన్నారు. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరోగ్య హక్కు చట్టం వ్యతిరేకిస్తూ ... సోమవారం స్థానిక ఐఎంఎ హల్ వద్ద నల్ల రిబ్బన్ ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర ధియేటర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహశీల్దార్ పిఎన్ డి ప్రసాద్ కి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ... ప్రభుత్వం ప్రైవేట్ వైద్యుల హక్కులను కూడా పరిగణనలోకి తీసుకుని వారితో చర్చించి సమగ్రమైన చట్టాన్ని తీసుకొచ్చే వరకు ఆరోగ్యం హక్కు చట్టాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు తాతిన రామబ్రహ్మం, వి. సుందరరావు, రమేష్ చంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.










