Jun 21,2023 12:37

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ... మండల కేంద్రమైన నార్పలలో హాకీ శిక్షకులు చంద్రశేఖర్‌ వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించి విద్యార్థులు వాకర్లతో యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ... ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. యోగాతో శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందని, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని, మనసులో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అరగంట యోగాసనాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసులు రాము, అమర్నాథ్‌, జావేద్‌, వాకర్లు ప్రకాష్‌ శేషు, శ్రీధర్‌, సురేష్‌, ఇలియాజ్‌, సంజీవరెడ్డి, బాబావలి, శంకర్‌ రెడ్డి, భాస్కర్‌, రాంకీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.