మొగల్తూరు (పశ్చిమ గోదావరి) : వీఆర్‌ఏల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మొగల్తూరు లోని రెవెన్యూ కార్యాలయం వద్ద వీఆర్‌ఏల రాష్ట్ర సంఘం పిలుపుమేరకు రెండో రోజు శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో వీఆర్‌ఏలు మోకాళ్లపై కూర్చుని వినూత్నంగా నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వీఆర్‌ఏలకు పే స్కేల్ వర్తింపజేయాలని నామినిలను వీఆర్‌ఏలుగా గుర్తించాలని, అర్హత ఉన్న వారిని పదోన్నతి కల్పించాలన్నారు, డిఏ తో కూడిన వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ అధ్యక్షుడు కోటిపల్లి వేణు, చంటిబాబు, గణేష్, కఅష్ణ, సత్యనారాయణ, శ్రీను, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు










