Apr 02,2023 13:17

తణుకు రూరల్‌ (ప.గో.జిల్లా) : తణుకు మండలం పైడిపర్రు గ్రామానికి చెందిన గిల్లి దుర్గాప్రసాద్‌ (33) రైలు కింద పడి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఏసీ మెకానిక్‌ గా పని చేస్తున్న దుర్గాప్రసాద్‌ ఇటీవల కాలంలో క్రికెట్‌ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. అప్పులపాలైన దుర్గాప్రసాద్‌ అప్పును తండ్రి రూ.1.60 లక్షలు తీర్చారు. మళ్లీ ఇటీవల ప్రారంభమైన ఐపిఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున నష్టపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.