May 05,2023 13:13

ప్రజాశక్తి - పెనుమంట్ర (పశ్చిమ గోదావరి) : డివైఎఫ్‌ఐ , ఐద్వా సహకారంతో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం వేసవి వినోద కార్యక్రమాలు పొలమూరు కలిదిండి సూర్యనారాయణ రాజు జన విజ్ఞాన వేదిక వద్ద మొదటిరోజు మాజీ సర్పంచ్‌ చింతపల్లి రామకఅష్ణ , బాలల సంఘం జిల్లా అధ్యక్షుడు ఋషి ప్రారంభించారు . ముందుగా అమరులైన చింతపల్లి శ్రీనివాస్‌ , కేత సత్య ప్రసాద్‌ చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా నాయకురాలు జయప్రద పిల్లలకు పద్యాలు , కథలు నేర్పారు. జెవివి జిల్లా అధ్యక్షుడు చింతపల్లి ప్రసాదరావు కూల్‌ డ్రింక్స్‌ పై అవగాహన కల్పించారు. స్పోకెన్‌ ఇంగ్లీష్‌ నేర్పారు. మ్యాజిక్‌ ప్రదర్శన నిర్వహించారు. మొదటి రోజు చిన్నారులకు స్నాక్స్‌ ను గ్రామ పెద్ద చింతపల్లి గురు ప్రసాద్‌ అందజేశారు. డివైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతపల్లి మావో లెక్కల్లో మెలకువలు నేర్పించారు. కార్యక్రమాలు అనంతరం కథలు, పోటీల్లో పాల్గొన్న చిన్నారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా నాయకురాలు చింతపల్లి భారతి , కేతా ప్రమోద్‌ , చింతపల్లి భరత్‌ చంద్ర చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్న 40 మంది చిన్నారులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.