May 14,2023 13:16

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు నియోజకవర్గంలో మండువేసవిలో ఆదివారం తెల్లవారుజామున మంచు దుప్పటి పరచుకుంది. గతంలో మే నెలలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదని అక్కడి వృద్ధులు చెబుతున్నారు. ఓవైపు పగటిపూట వేసవి సెగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు మంచు దుప్పటి ఊరట ఇచ్చింది. మరో 10 రోజుల్లో రోహిణి కార్తే ప్రవేశిస్తున్న మే నెలలో మండుటెండల ప్రభావం రోజురోజుకు పెరుగుతున్న వేళ.. మంచుదుప్పటి సామాన్య, మధ్య ప్రజలకు ఊరటనిచ్చింది. అయితే ఆదివారం ఉదయం వివాహాలకు హాజరయ్యే వాహనదారులకు మాత్రం ప్రయాణ కష్టాలు తెచ్చింది.