- బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా మున్సిపల్ యూనియన్ కార్మిక నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ శనివారం బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్ ఎదుట మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తక్షణం కార్మిక నేతలను విడుదల చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు మరో పోరాటానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఉద్యోగ కార్మిక సంఘం మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం తదితరులను శుక్రవారం రాత్రి అరెస్టు చేసి బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్‌కు తరలించారు బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అక్రమ అరెస్టులను వివిధ కార్మిక సంఘాలు వివిధ కార్మిక సంఘాలు ఖండించాయి ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు బండారు ఎర్రి స్వామి, సాకే తిరుమలేష్, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు లక్ష్మీ నరసమ్మ, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, శేషేంద్ర కుమార్, నాలుగవ సర్కిల్ కార్మికులు, నారాయణ, రవి, అంపన్న, ముత్యాలమ్మ, గంగా లక్ష్మి, కుమార్, రేణుక, నాగేంద్ర కులాయప్ప, అరుణమ్మ, తదితరులు పాల్గొన్నారు.










