ప్రజాశక్తి - చిత్తూరు : చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున కర్ణాటక మద్యం చేసుక్నుట్లు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. అలాగే రూ. ఐదు లక్షలు విలువచేసే 4 వేల మద్యం బాటిళ్ళను, ఒ కారును స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వివరాల ప్రకారం.. చిత్తూరు చెర్లోపల్లి వద్ద వున్న సర్వీస్ రోడ్డులో అనుమానాస్పదంగా ఉన్న కారును నిలిపి తనిఖీ చేయగా అందులో అక్రమంగా రవాణా చేస్తున్న 40 కేసులు, 5 సంచులలోని కర్ణాటక మద్యంను గుర్తించినట్లు తెలిపారు. దీంతో కారు నడుపుతున్న వ్యక్తి అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ మద్దయ్య చారి, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.










