Mar 23,2023 15:57

ప్రజాశక్తి-పుట్లూరు(అనంతపురం) : అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న ఉద్యాన పంటలను గుర్తించాలని సచివాలయ ఉద్యోగులకు ఎంపీడీవో యోగానంద రెడ్డి సూచించారు. ఎంపీడిఓ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఎంపీడీవో మాట్లాడుతూ.. నష్టపోయిన ప్రతి రైతు వివరాలను తప్పనిసరిగా విస్తీర్ణంతో సహా గుర్తించాలన్నారు. ఏ రైతు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఏ ఏ పంటలు వేశారు. ఎంత నష్టం వాటిల్లింది. దానిపై పంట పొలాలకు వెళ్లి నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. పంట నష్టం వివరాలు నమోదు చేయడంలో అలసత్వం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని ఎంపీడీవో హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు ఆర్టికల్చర్‌ అగ్రికల్చర్‌ అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.