Mar 21,2023 15:30

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమగోదావరి) : విద్యార్థులకు పోషక విలువలు గల ఆహారం అందించడం వలన విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాస్‌ రావు(వాసుబాబు) అన్నారు. మంగళవారం జగనన్న గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాగి మాల్ట్‌ (జావ) పంపిణీ కార్యక్రమాన్ని గణపవరం జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు ఐదు రోజులపాటు గుడ్లు, మూడు రోజులపాటు చిక్కీలు 15 రకాల పోషక విలువ గల ఆహారాన్ని అందిస్తునట్లు తెలిపారు. ఇకనుండి మూడు రోజులు పాటు రాగి మాల్ట్‌ జావా అందించడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం పథకానికి ఏడాదికి 450 కోట్లు ఖర్చు పెడితే జగనన్న ప్రభుత్వం 1910 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హై స్కూల్‌లో తయారు చేసిన రాగిజావను ఆయన రుచి చూశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పి.శేషు, జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ హెచ్‌ఎంలు కే.రాంబాబు ఏ.అనురాధ, గ్రామ సర్పంచి మూర అలంకారం, ఉపసర్పంచ్‌ దండు రాము, వైసిపి నాయకులు పాల్గొన్నారు.