మొగల్తూరు (పశ్చిమ గోదావరి) : మనుషుల అందాన్ని రెట్టింపు చేసే విధంగా దుస్తులు కుట్టేది ఒక దర్జీ అని బాపూజీ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లా రాము అన్నారు. మంగళవారం టైలర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుట్టుమిషన్ సృష్టికర్త విలియం హౌం చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కేకును కట్ చేసి పంచారు. గ్రామంలో ప్రదర్శన చేశారు. అనంతరం పేరుపాలెం బీచ్ లో ఆత్మీయ సమావేశం అయ్యారు. సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా బీచ్ లో సహపంక్తి భోజనాలు చేసి సేదతీరారు. ఆయా కార్యక్రమాల్లో ఆ సంగతి కార్యదర్శి పడవల నారాయణ, కోశాధికారి షరబు సూర్యనారాయణ, బక్క రాజేశ్వరరావు, బోల్ల కృష్ణ, పిట్ట శాంతారావు, కౌరు నాగేశ్వరరావు, నంబల రమేష్, అడ్డాల రంగారావు, తుమ్మ బావన ఋషి, తదితరులున్నారు.










