ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరిజిల్లా) : అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి ఇల్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్ డిమాండ్ చేశారు. సిపిఎం ఆచంట వేమవరం గ్రామ శాఖ ఆధ్వర్యంలో సిపిఎం ప్రచార బేరి యాత్రలో భాగంగా సోమవారం అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాన్ని సిపిఎం సభ్యులు పరామర్శించి ఆ కుటుంబానికి దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన ఆచంటలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దల కాలంగా సిపిఎం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తున్నామని, ఎన్ని ప్రభుత్వాలు మారిన ఆచంటలో అగ్నిమాప కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ఇటువంటి పేద కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేద వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకుని ఆచంటలో అగ్నిమాప కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం బందం సభ్యులు వాసా రామ్మెహనరావు, కొండేటి సత్యనారాయణ, మండల కమిటీ సభ్యులు గుత్తుల రంగారావు, సిర్రా నరసింహమూర్తి, ఇందుకూరి సూర్యనారాయణ, రాజు, వెన్నపు ప్రసాద్, కరుటూరి సత్యనారాయణ, రాపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.










