Mar 25,2023 12:41

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : నార్పల మండలం బొందలవాడ గ్రామానికి చెందిన ప్రైవేటు టీచర్‌ కె.రమాదేవి, నడిమీదొడ్డి గ్రామానికి చెందిన జాఫర్‌ అనే మోసగాడి చేతిలో మోసపోయి దారుణంగా హత్యకు గురైంది. రమాదేవి కుటుంబాన్ని ఆదుకొని నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో... శనివారం అధికారులు మాట్లాడుతూ .... రమాదేవి కుటుంబానికి ప్రభుత్వం రూ.8,25,000 అందించనుంది అని తెలిపారు అందులో భాగంగా. ప్రస్తుతం 4,12,500 రూపాయలను జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశాల మేరకు శనివారం బొందలవాడ గ్రామానికి వెళ్లి రమాదేవి తల్లిదండ్రులు నారాయణమ్మ, నారాయణప్పలకు ఆర్డిఓ మధుసూదన్‌ చేతుల మీదుగా వారి అకౌంట్‌ కు నేరుగా చేర్చడానికి ప్రతిపాదన పత్రాలను అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్‌, తహశీల్దార్‌ నారాయణస్వామి, ఆర్‌.ఐ సందీప్‌, వీఆర్వోలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.