ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి - చిత్తూరు : విద్యా సంస్కరణల పేరుతో విద్యారంగంలో వినాశకర మార్పులను ప్రభుత్వం తీసుకొస్తుందని ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 117 వెంటనే రద్దు చేయాలని కోరుతూ గురువారం స్థానిక డీఈఓ కార్యాలయం ఎదుట ఫ్యాప్టో నేతత్వంలో ఉపాధ్యాయ సంఘాలు భారీ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరు మాట్లాడుతూ.. హేతుబద్ధత పేరుతో విద్యా వ్యవస్థను నాశనం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి 117 జీవోను రద్దు చేయకుంటే డిఈఓ, కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు జి.వి.రమణ, సుధాకర్ రెడ్డి, గంటా మోహన్, సోమశేఖర్ నాయుడు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










