ప్రజాశక్తి-పెద్దపంజాణి(చిత్తూరు) : మండలంలోని కెలవాతి గ్రామంలోని అభయాంజనేయ స్వామి ఆలయ పున్ణప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణం చేపట్టి 12ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మాజీ మంత్రి ఎన్.అమరనాథ రెడ్డి కుటుంబీకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్వస్తి పున్య్ణవచనము, గోపూజ, కుంభారాధన, ముక్త హౌమాలతో పాటు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్బంగా తీర్థ ప్రసాదాల పంపిణీితో పాటు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు అమరనాథరెడ్డి అమ్మ తాయారమ్మ, రేణుకా రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, అనీషా రెడ్డి, ప్రసేన్ రెడ్డి బంధు మిత్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.










