ప్రజాశక్తి-పీలేరు (చిత్తూరు) : పీలేరు పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి వేడుకలను యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆదివారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలోని మహాత్ముని విగ్రహానికి యుటీఎఫ్ సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె. సదాశివరెడ్డి, అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. శివారెడ్డి, జిల్లా ఆర్థిక కార్యదర్శి అక్రం బాష, జిల్లా కార్యదర్శి బి. చంద్రశేఖర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ గౌరవ అధ్యక్షులు జి. రాధాకష్ణ, పీలేరు, కె.వి. పల్లి, రొంపిచర్ల, ఎర్రావారిపాలెం మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు జి. వెంకటరమణారెడ్డి, విశ్వనాథరెడ్డి, ఆర్. కష్ణమూర్తి, ఆర్, సుధాకర్, ఈశ్వర ప్రసాద్, మస్తాన్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.










